పునర్నిర్మాణ పనుల్లో జాప్యం వద్దు
అంజూరు ఫైర్
ప్రజాశక్తి- శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధం దేవాలయమైన శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి దేవాలయము పునర్నిర్మాణ పనుల్లో జాప్యం తగదని ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. పనుల్లో జాప్యాన్ని కారణమైన ఇంజనీరింగ్‌శాఖ అధికారులపై మండిపడ్డారు. ఆదివారం ఆయన యువసాగర్ బాబుతో కలిసి ప్రసన్న వరదరాజుల స్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఇకపై ప్రతిరోజు యుద్ధ ప్రాతిపదికంగా పనులను నిర్వహించాలని ఆదేశించారు. 15 లేయర్లు నిర్మాణ పనులకు సంబంధించిన టెక్నికల్ అనుమతులు లభించాయి కాబట్టి ఎలాంటి జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఇక ఎలాంటి పరిస్థితుల్లోనూ జాప్యానికి తావు లేకుండా పనులను శరవేగంగా చేయాలని కాంట్రాక్టర్లు ను ఆదేశించారు. ప్రస్తుతం ఐదవ లేయర్ పనులు పూర్తి అయ్యింది కాబట్టి మిగతా లేయర్లు పనులను విభజించుకుని పనులను వేగవంతం చెయ్యకపోతే రాబోయే రోజుల్లో కుంభాభిషేకం సమయానికి పూర్తి కాదని తెలిపారు. అధికారులకు కాంట్రాక్టుకు తెలియజేశారు. అదేవిధంగా 15 లేయర్లకు సంబంధించి రాతి బండలను స్కిట్ కాలేజ్ వద్ద చేరవేసి పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. అదేవిధంగా పునర్మాణ పనులను దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు పూర్తిగా ప్రతిరోజు పర్యవేక్షించాలని సూచించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పాత రాతిబండల రబ్బీస్ను యుద్ధ ప్రాతిపదికన తొలగించి లోబావిలో చేర్చాలని సూచించారు. శిల్పి కార్మికులను కూడా పెంచి పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. తెలియజేశారు.










