శ్రీనగర్ : దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా పట్టణంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. భద్రతాదళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వారు మరణించారని చెప్పారు. మరణించిన వారిలో ఒకరు పాకిస్తాన్ లష్కర్-ఇ-తొయిబా కమాండర్ ఐజాజ్ అలియాస్ అబూ హురైరా కాగా, మిగిలిన ఇద్దరిని గుర్తించాల్సి వుందని అన్నారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఇంకా గాలింపు కొనసాగుతోందని అన్నారు.










