ఫొటో : పనులు పరిశీలిస్తున్న ఎంపిడిఒ శ్రీనివాసులు
పూడికతీత పనులు పరిశీలన
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్ : మండలంలోని నువ్వురుపాడు పంట కాలువ పుడికతీత ఉపాధి పనులను ఎంపిడిఒ సి.శ్రీనివాసులు పరిశీలించినారు. ఎంపిడిఒ మండలంలోని నువ్వురుపాడు గ్రామంలోని అంబేద్కర్ కాలనీ సమీపంలో శుక్రవారం గోపాలరెడ్డి పొలాలు నుంచి పిల్లి కాలువ వరకు ఉపాధి పథకం కింద జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉపాధి పనులను పెంచి ఎక్కువగా లేబర్ వేజెస్‌ను పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసులు పాల్గొన్నారు.










