Jan 11,2023 21:08

ఫొటో : పనులు పరిశీలిస్తున్న ఎంపిడిఒ శ్రీనివాసులు

పూడికతీత పనులు పరిశీలన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : మండలంలోని మహిమలురులోని కాల్వ పూడికతీత పనులను బుధవారం ఎంపిడిఒ సి.శ్రీనివాసులు పరిశీలించారు. గ్రామ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిమలూరులోని పలు ప్రాంతాలలో పర్యటించి అక్కడ చేసిన బ్లీచింగ్‌ కార్యక్రమాలను పరిశీలించారు. తూర్పు వీధిలో వున్న మట్టి కాలువ పూడికతీత పనులు పర్యవేక్షించారు.
గ్రామంలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని, దోమల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన పంచాయతీ కార్యదర్సి పి.భాస్కర్‌కు ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్‌ పి.చంద్రశేఖర్‌, మహిళా పోలీసు నాగేంద్రమ్మ పాల్గొన్నారు.