Jan 24,2023 21:53

ఫొటో : పనులు పరిశీలిస్తున్న ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌

పూడికతీత పనులను పరిశీలన
ప్రజాశక్తి-ఉదయగిరి : ఉపాధి హామీ కూలీలు చేపడుతున్న చెక్‌డ్యామ్‌ పూడికతీత పనులను ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం బండగానిపల్లి మార్గం మధ్యలో తనిఖీ చేసి ఈ సందర్భంగా కూలీలు సిబ్బందితో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా వర్షపు నీరును పొదుపు చేసేందుకు చెక్‌ డ్యామ్‌లో మట్టి తొలగించే పనులు చేపట్టామన్నారు.
కూలీలు సమయపాలన పాటిస్తూ పనికి తగ్గ నగదును పొందాలన్నారు. పనులు చేసే ప్రదేశంలో పనికి తగ్గట్టు కూలీలకు పనులు మెజర్మెంట్‌ చేసి కూలీలు గిట్టుబాటు అయ్యేలా సిబ్బంది చూడాలన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ హరి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.