Mar 21,2023 22:08

నివాళులు అర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-సోమందేపల్లి : పుచ్చలపల్లి లీలా సుందరయ్య వర్ధంతిని సిపిఎం నాయకులు మంగళవారం నిర్వహించారు. మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెద్దన్న మాట్లాడుతూ లీలమ్మ పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. పార్టీ మీద ఆమెకు అచెంచల విశ్వాసం ఉండేదన్నారు. భర్త సుందరయ్య కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిందన్నారు. సుందరయ్య కు ఉద్యమ సహచరిగా ఉంటూ కళాకారిణిగా గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలను కదిలించి తోడుగా ఉండేదని గుర్తు చేశారు. రైతు కూలీ సంఘం సీనియర్‌ నాయకులు ఖాసిం మాట్లాడుతూ 33 శాతం మహిళా రిజర్వేషన్‌ సాధిస్తూ కమ్యూనిస్టు పరిపాలన తీసుకురావడమే లీలమ్మకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు హనుమయ్య , వెంకటేశులు, మాజీ వార్డు మెంబర్‌ వెంకటేశులు , సిఐటియు మండల నాయకులు కొండా వెంకటేశులు , భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నాగభూషణ , చేనేత మండల నాయకులు శీలా నారాయణస్వామి, ఈడిగ నాగరాజు, దేవాంగం వెంకటేశులు, హుస్సేన్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రవి , ఐద్వా లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.