Dec 28,2022 19:17

మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

ప్రజాశక్తి-రామాపురం : సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అమలుపరిచే బాధ్యత బూత్‌ కమిటీ కన్వీనర్లు, వాలంటీర్లు దేనని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయంలో బూత్‌ కమిటీ కన్వీనర్లు, వాలంటీర్లు, పార్టీ కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. వ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన పెన్షన్‌ రూ.2750 విషయం పింఛను దారులకు తెలియజేయాలన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని దాదాపు అమలు చేస్తూ వస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి వాలంటీర్‌ కింద ఇద్దరు గహ సారధులు ఉంటారని, బూత్‌ కమిటీ కన్వీనర్లు గహసారధులను కలుపుకొని ప్రతి ఇంటికీ చేరువవుతున్నా సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో మండల మాజీ మండల అధ్యక్షులు పార్టీ కన్వీనర్‌ జి.జనార్దన్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కె.విశ్వనాథరెడ్డి, జడ్‌పిటిసి మాసన వెంకటరమణ, వైసిపి నాయకులు సూరం వెంకటసుబ్బారెడ్డి, రాయచోటి నియోజకవర్గం బూత్‌ కమిటీ కన్వీనర్ల అబ్జర్వర్‌ కరీముల్లా,హొ ఉప ఎంపిపి రవిశంకర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు, బూత్‌ కన్వీనర్లు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.