హిందూపురం : విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్య ఛేదన కోసం క్రమశిక్షణ, పట్టుదలతో శ్రమిస్తే విజయం వారి వెంటే ఉంటుందని పాంచజన్య శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని పాంచజన్య బ్రిలియంట్ హైస్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సభ జరిగింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పాఠశాల తరఫున విద్యార్థులందరికీ పెన్నులు, పరీక్ష ప్యాడ్లను పాఠశాల అధ్యక్షులు శ్రీనివాసులు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతు విలువలతో కూడిన విద్య వివేకాన్ని పెంచుతుందని అన్నారు. పదవ తరగతిలో ఉమ్మడి జిల్లా మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి ఇంటర్మీడియట్ చదువుకు పూర్తిస్థాయిలో పాఠశాల తరఫున ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తరఫున పాఠశాల తరఫున ప్రత్యేకంగా అభినందించి వారికి తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు. విద్యార్థులు వారి గురువులకు జ్ఞాపికలను అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి నందకుమార్, ఎఒ భాస్కర్, హెచ్‌ఎం గాయత్రి, ఎహెచ్‌ఎం విజయేంద్ర, శశికళ, ఉపాధ్యాయులు సతీష్‌కుమార్, షేక్ అబ్దుల్ రజాక్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










