సిసి ఫుటేజీలో కన్పిస్తున్న దొంగలు
మడకశిర : మడకశిర పట్టణంలో సోమవారం రాత్రి మారుతి నగర్‌లోని16 ,17వ వార్డులలో దొంగలు హల్‌చల్ చేశారు. ఏకకాలంలో ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు .దాదాపు ఆరు లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగల తో పాటు 60 వేల రూపాయలు నగదును దోచుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. రాత్రుల్లో పోలీసుల గస్తీ నామ మాత్రంగా చేస్తుండటం వల్ల పట్టణంలో దొంగతనాలు ఎక్కువయ్యాయన్న ఆరోపణలు బలంగా విన వస్తున్నాయి. మారుతి నగర్ లో నలుగురు వ్యక్తులు షార్ట్స్ ్ల వేసుకుని మాస్కులు ధరించి అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఐదు ఇళ్లలో తాళాలు పగల గొట్టి గుల్ల చేసి వెళ్ళి పోయారు.










