మాట్లాడుతున్న కమీషనర్ మనోహర్
ప్రజాశక్తి -కందుకూరు : స్థానిక పురపాలకసంఘం పరిధిలో ప్రభుత్వం వారిచే ప్రతిష్టాత్మకముగా జగనన్న శాశ్వత భు హక్కు, భూరక్ష'' పథకానికి సంభంధించి గురువారం కమిషనర్ ఎస్ మనోహర్ సమావేశం నిర్వహిచారు. కందుకూరు ముసాయిదా మాస్టర్ ప్లాన్‌లో ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సలహాల మేరకు కార్యాలయం పట్టణ ప్రణాళిక సిబ్బంది, ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీలతో ఆయన మాట్లాడారు. వైఎస్‌ఆర్ శాశ్వత భుహక్కు భూరక్ష'' పధకమునకు సంభందించి ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు అనుసరించవలసిన ప్రణాళికలను అమలు చేయుటకు అవగాహన కల్పించారు. తీవ్రమైన ట్రాఫిక్ పరిశిలించి రోడ్డు ఆక్రమణకు గురైన ప్రాంతములో ఆక్రమణలను పూర్తిగా తొలగించుటకు తీసుకొనవలసిన చర్యలను వివరించారు.










