May 07,2023 22:24

మున్సిపల్‌ కమిషనర్‌ గంగా ప్రసాద్‌

 రాయచోటి : రాయచోటి పట్టణ అభివృద్ధే తమ లక్ష్యమని మున్సిపల్‌ కమిషనర్‌ గంగా ప్రసాద్‌ పేర్కొన్నారు. రాయచోటి మున్సిపాల్టీలో చేప డుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా ఇతర విషయాలను ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో వివరించారు.
మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని వార్డులు ఉన్నాయి? గహాలు, జనాభా వివరాలు తెలపండి?
పట్టణంలో 34 వార్డులు ఉన్నాయి. దాదాపు 28 వేల గహాలు ఉన్నాయి. దాదాపు లక్ష 10 వేల జనాభా ఉన్నారు. అందరికీ అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం.
పట్టణంలో ప్లాస్టిక్‌ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. వ్యాపార సంస్థల యజ మానులతో సమావేశమై సంపూర్ణ ప్లాసిక్‌ నిషేధం కోసం టీమ్‌లు ఏర్పాటు చేశాం. విడతల వారిగా పటిష్ట చర్యలు తీసుకుంటాం.
ఫ్లెక్సీల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఇప్పటికే అనుమతులు లేని ప్లెక్సీలు తొలగించాం. తప్పనిసరిగా మున్సిపాలిటీ అనుమతి పొంది నిర్దేశిత చాలానా రుసుం చెల్లించి నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే ఫెక్ల్సీలను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం.
పట్టణంలో కుక్కలు, పశువులు నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
పట్టణంలో కుక్కల నిర్మూలన కోసం ఇప్పటికే గత వారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాం. తిరుపతికి చెందిన అనిమల్‌ కేర్‌ వారు కుక్కలను పట్టారు. అలాగే కుక్కలకు ఎబిసి ఎఆర్‌వి అనే వ్యాక్సిలను వేయిస్తున్నాం. కుక్కలు, పశువుల నిర్మూలన ఇంకా కొనసాగుతుంది. రోడ్లపై విచ్చల విడిగా వదిలేసిన పశువుల యజమానులకు నోటీసులు అందించి, ఎవరు ముందుకు రాకపోతే పోలీస్‌ సహకారంతో గోశాలకు తరలిస్తున్నాం.
పట్టణ ప్రజలకు ప్రభుత్వ పథకాలను ఎలా అందించాలని భావిస్తున్నారు?
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలలో వాలంటీర్ల ద్వారా ప్రజలకు పథకాలు సరైన సమయంలో దరఖాస్తు చేసుకునే విధంగా వాలంటీర్లు పనిచేస్తున్నారు. 25 సచివాలయలోని దాదాపు 220 మంది సిబ్బంది 427 మంది వాలంటీర్ల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడూ చేరవేస్తున్నాం.