ప్రజాశక్తి - సోమందేపల్లి : మండల కేంద్రంలోని పందుల పెంపకం దారులు వారు సాగు చేస్తున్న భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కమిటీ సభ్యులు బాలస్వామి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రెండవ సచివాలయంలో వ్యక్తిగత ఆర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం ధర్నా నిర్వహించామని అనంతరం స్థానిక సచివాలయాలలో వ్యక్తిగత అర్జీలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారని చెప్పారు. ఈ మేరకు స్థానిక సచివాలయంలో వ్యక్తిగత అర్జీలు సమర్పించడానికి వెళ్లడంతో సచివాలయంలో పంచాయతీ సెక్రెటరీ మాత్రమే అందుబాటులో ఉన్నారని అన్నారు. అర్జీలు తీసుకోవడానికి సిబ్బంది సహకరించకపోవడంతో ధర్నా నిర్వహించామన్నారు. స్పందించిన పంచాయతీ సెక్రెటరీ సంబంధిత విఆర్‌ఒను పిలిపించి అర్జీలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాగుదారులు అంజనమ్మ, లక్ష్మీదేవి, వెంకటేశు, గుర్రప్ప, రవి, ఆంజనేయులు, నాగమ్మ, సుంకమ్మ, వెంకట లక్ష్మమ్మ, రామాంజనప్ప, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.










