రాయచోటి : కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు నిర్ణీత కాలంలో జారీ చేయాలని కలెక్టర్ గిరీష పిఎస్ సచివాలయ సిబ్బందికి ఆదేశించారు.శ నివారం మధ్యాహ్నం రాయచోటి మండలం, చెన్నముక్కపల్లి -2 గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ గిరీష పిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రగతి నివేదికలను, హాజరు పట్టీలను కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయాల్లో ప్రజల నుంచి సర్వీస్ రిక్వెస్టులు పెరిగేలా చూడాలని, అన్ని రకాల సేవలు సులభతర రీతిలో అందించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి ఇక్కడ అందే సేవలపై విస్తతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు నిర్ణీత కాలంలో జారీ చేయాలని చెప్పారు. అయిష్మన్ భారత్ పెండింగ్ లేకుండా చూడలన్నారు. సచివాలయ సిబ్బంది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలు సంతప్తి చెందేలా మెరుగైన సేవలు అందించాలన్నారు. సచివాలయానికి వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడూ పరిష్కరించేలా సచివాలయ సిబ్బంది ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, ప్రజల నుంచి అందిన అర్జీలు నిర్ణీత గడువులోగా పరిష్కరించి బియాండ్ ఎస్‌ఎల్‌ఎలోకి వెళ్లకుండా చూడాలన్నారు. సచివాలయ పరిధిలో రోజూ ఎన్ని అర్జీలు వస్తున్నాయి, వచ్చిన అర్జీల్లో ఎన్ని పరిష్కరించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ పౌర సేవలను విస్తతంగా అమలు చేసి ప్రజల నుంచి అందిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు. తనిఖీలో రాయచోటి తహశీల్దార్ రవిశంకర్ రెడ్డి, ఎపిఐఐసి డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










