మాట్లాడుతున్న కమిషనర్
పటిష్టంగా ''జగనన్న ఆరోగ్య సురక్ష'' కార్యక్రమం
ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించిన ''జగనన్న ఆరోగ్య సురక్ష'' కార్యక్రమాన్ని సచివాలయాల పరిధిలో పటిష్టంగా అమలు చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ కార్యదర్శులను ఆదేశించారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక 8/2 విజయ గోపాల పురం, 9/4 పుట్టా స్ట్రీట్ వార్డు సచివాలయాలను కమిషనర్ వికాస్ మర్మత్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాలలోని ఇన్స్పెక్షన్ రిజిష్టరు, నోటీసు బోర్డు, హాజరు రిజిస్టరు, స్పందన రిజిష్టరులతో పాటు వివిధ సంక్షేమ పథకాల రికార్డులను పరిశీలించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమ అమలును అన్ని సచివాలయాల్లో ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, జగనన్న ఆరోగ్య సురక్ష పథకం వైద్య సదుపాయాలు అవసరమైన అందరికీ చేరువయ్యేలా సచివాలయం హెల్త్ సెక్రెటరీ కషి చెయ్యాలి అని కమిషనర్ తెలియచేశారు.అదేవిధంగా సచివాలయాల్లో పెండింగులో ఉన్న సేవలను గడువులోపు పూర్తి చేయాలని, సాంకేతిక అంశాలపై కార్యాలయం నుంచి నేరుగా సూచనలు పొందాలని సచివాలయాల కార్యదర్శులకు కమిషనర్ సూచించారు. ఎస్.డి.జి సర్వే, భూహక్కు సర్వే, ఎ.పి. సేవా పోర్టల్ అంశాలపై ప్రత్యేక దష్టి సారించి, సూచించిన యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని తెలిపారు. స్పందన, జగనన్నకు చెబుదాం ఫిర్యాదులు, నాడు - నేడు పనుల పురోగతి, ఆస్థి పన్ను, యూజర్ చార్జీల వసూళ్ళను సచివాలయ కార్యదర్శులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు అందించే సేవల్లో నిబద్ధత పాటించాలని, తమకు నిర్దేశించిన పన్నుల వసూళ్ల లక్ష్యాలను గడువులోపు అందుకోవాలని సూచించారు. జగనన్న కాలనీ లే అవుట్ల నిర్మాణం పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని అమెనిటీస్ కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శర్మద, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.










