ప్రజాశక్తి -పొదలకూరు :పొదలకూరు మండలంలో 3వ దశలో ఎనిమిది గ్రామాల్లో జరుగుతున్న రీ సర్వే పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ సర్వే, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పొదలకూరు మండలంలో భూ సర్వే పై ఆర్‌డిఒ, తహశీల్దార్, సర్వే అధికారులతో సమీక్ష చేశారు. భూ సర్వే రికార్డులను తనిఖీ చేశారు. 9(2)నోటీసులు, కోరులేషన్ షీట్లు, చల్తా నెంబర్లు, సర్వే రికార్డులు నిశితంగా పరిశీలించారు. భూ సర్వే రికార్డుల నిర్వహణ లోటు పాట్లు గమనించిన కలెక్టర్ వాటిని సరిదిద్దుకోవాలని లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.రీసర్వే రికార్డ్ లను జాగ్రత్తగా భద్రపర చాలన్నారు. ఆర్డిఒ మలోల, తహశీల్దార్ వీర వసంతరావు, మండల సర్వేయర్ వెంకటస్వామి, రీసర్వే డ్యూటీ, సర్వే ఇనెస్పెక్టర్లు పాల్గొన్నారు.










