May 06,2023 22:05

ఫొటో: మాట్లాడుతున్న సంచార వాహన పశు వైద్యురాలు డాక్టర్‌ మౌనిక

పశువైద్య సేవలను వినియోగించుకోండి
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పశు సంచార సేవా వాహనం సేవలను మండల రైతులు ఉపయోగించుకోవాలని సంచార వాహనపశు వైద్యురాలుడాక్టర్‌ మౌనిక కోరారు. సంచార వాహనంలో పశు వైద్య సిబ్బంది గ్రామాలకు వచ్చి పశువులకు వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఈ వాహనం మర్రిపాడు, అనంతసాగరం, చేజర్ల మండలాలోని గ్రామాలలో తిరుగుతూ వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలల నుండి 200 కేసులు చేశామన్నారు. శ
నివారం మర్రిపాడు మండలం డిసిపల్లి గొర్రెల కాపరికి చెందిన ఓ గొర్రె ఈనలేక మర్రిపాడు పశు వైద్యశాలకు తీసుకురాగా డాక్టర్‌ అన్సారి ఆధ్వర్యంలో వైద్యం చేశామన్నారు. 1962 వాహనం పాడి రైతులకు మరెన్నో సేవలు అందిస్తుందని రైతులు ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పశువర్థకశాఖ ఏడిగురు జయంతి, పశు వైద్య సిబ్బంది, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పశుసంచార సేవ వాహన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.