Apr 03,2023 21:54

ఫొటో : వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేస్తున్న రైతు సంఘం నాయకులు

పసుపును ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : మెట్ట ప్రాంత పసుపు రైతులు పండించిన పసుపు పంటను ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ఎపి రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం మండల పరిధిలోని బండగానిపల్లి సచివాలయం ఎదుట పసుపు రైతులతో ఆయన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమలో పసుపు రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి మెట్ట ప్రాంత పసుపు రైతులను ఆదుకుందని, అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులు వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి ఈ ప్రాంత పసుపు రైతులను ఆదుకోవాలన్నారు.
అధిక వడ్డీలతో ఏకరాకి లక్ష పైగా ఖర్చు చేసి పండించిన పసుపు పంట కళ్ల ఎదుట ఉండడం రైతులను ఎంతో భాదిస్తుందని కుటుంబం భారమవుతున్న తరుణంలో ఎక్కువ రోజులు కొనుగోలు ప్రభుత్వం జాప్యంతో రోజులు గడుస్తున్నా రైతుకు ఆత్మహత్యలు శరణ్యం అవుతున్నాయని తెలిపారు. వెంటనే ఈ ప్రాంత రైతులను ఆదుకొని కుటుంబాలకు అండగా ప్రభుత్వం నిలవాలని నినాదాలు చేశారు. అనంతరం వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.