Dec 21,2022 22:43

మొక్కలు నాటుతున్న అధికారులు

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి మండలంలోని జగరాజుపల్లి ఆదర్శ పాఠశాల, జూనియర్‌ కళాశాల ఆవరణంలో సామాజిక అటవీ విభాగం ఆధ్వర్యంలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. అనంతరం మోడల్‌ స్కూల్‌ ఆవరణంలో ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ అందరి సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి మనమందరం మొక్కలు నాటాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు అంతకుమునుపు విద్యార్థులచే జగనన్న పచ్చ తోరణం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సామాజిక వన విభాగం డివిజన్‌ అటవీశాఖ అధికారి పి శ్యామల, డివిజనల్‌ అటవీశాఖ అధికారి రవీంద్రనాథ్‌ రెడ్డి, డిడబ్ల్యుఎంఎ పీడీ రామాంజనేయులు, ఉద్యానవన శాఖ అధికారి చంద్ర శేఖర్‌, కళాశాల ప్రిన్సిపల్‌ రమేష్‌ బాబు, జెడ్పీటీసీ లక్ష్మీ నరసమ్మ, సర్పంచి వెంకటసుబ్బడు, ఎంపీటీసీ మధురిమ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.