Feb 03,2023 22:08

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎపిసిసి వర్కింగ్‌ ప్రసిడెంట్‌ గౌతం, తదితరులు

ధర్మవరం టౌన్‌ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను సాధించడంలో టిడిపి, వైసిపి విఫలమయ్యాయని ఎపిసిసి వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జంగా గౌతమ్‌ విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకు మునుపు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూడో యాత్రను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో చేయి చేయి కలుపుదాం రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. జనవరి 36 నుండి మార్చి 28వతేదీ వరకు కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల నుండి ప్రజల మద్దతు లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమాన్ని దర్మవరంలో ప్రారంబించడం జరిగిందన్నారు. ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో నేడు ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి సభ్యులు, హిందూపురం పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి కెటి. శ్రీధర్‌, ఐఎన్‌టియుసి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అమీర్‌బాషా, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి రంగన అశ్వర్థనారాయణ, ముదిగుబ్బ, తాడిమర్రి మండల కన్వీనర్లు బాసినేని ప్రభాకర్‌, కాటమయ్య, నాయకులు వెంకటరెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రసాద్‌, నాయకులు నరేంద్ర, రంగనాథ్‌, సురేశ్‌ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.
పరిగి : కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని చేపట్టిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చినట్లు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాయలసీమ జిల్లాల ఇన్‌ఛార్జి జంగం గౌతమ్‌ గుర్తు చేశారు. శుక్రవారం పరిగి మండలం సేవామందిర్‌ కెటి శ్రీధర్‌ నివాసంలో పెనుగొండ నియోజకవర్గం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనితీరు రోజురోజుకు దిగజారి పోతోందన్నారు. జూడో యాత్రను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో చేయి చేయి కలుపుదాం రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మతతత్వ విభజన రాజకీయాల ద్వారా ప్రజలను విభజిస్తోందని అలాంటి పాలనకు స్వస్తి పలికే విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఇక రాష్ట్రంలో అయితే వైసీపీ పాలన పూర్తిగా విఫలమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డి రాజధానిని సైతం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నారన్నారు. ప్రజలను విభజించి పాలించే విధంగా మూడు రాజధానుల కోణాన్ని ముందుకు తీసుకొచ్చారని విమర్శించారు. ప్రస్తుతం మద్యం దందా, భూమాఫియా మధ్య రాష్ట్రంలో పాలన సాగుతోందని ఆరోపించారు. అనంతరం గోడపత్రికలను విడుదల చేశారుచేశారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి మెంబర్‌ కెటి. శ్రీధర్‌, సోషల్‌ మీడియా అహ్మద్‌, పెనుగొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నరసింహులు, పరిగి మండల ప్రెసిడెంట్‌ భాస్కర్‌ రెడ్డి, విశ్వనాథ్‌ రెడ్డి, ఎ.బ్లాక్‌ ప్రెసిడెంట్‌ వెంకట్రాంరెడ్డి, బి బ్లాక్‌ ప్రెసిడెంట్‌ రాజారెడ్డి, మండల నాయకులు రామకృష్ణ, రామాంజనేయులు, నారాయణ, ఈశ్వరప్ప, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.