Jan 06,2023 22:05

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ చంద్రశేఖర్‌రెడ్డి

ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత కోసం ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంఎల్‌ఎ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న డ్రైడే ఫ్రైడే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి.. అన్న నినాదంతో ప్రభుత్వం కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తుందన్నారు.
ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రతిఒక్కరూ సహరించి ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ పాల్గొని సంపూర్ణ ఆరోగ్యానికి భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ అక్కి భాస్కర్‌రెడ్డి, మండల నాయకులు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.