Apr 10,2022 22:30
  • 94 మంది మహిళా ప్రతినిధులు
  • అత్యధిక జైలు జీవితం గడిపినవారు తరిగామి

ఇకె నయనార్‌ నగర్‌ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : సిపిఐ(ఎం) 23వ మహాసభకు ప్రతినిధులుగా హాజరైనవారిలో అతిపెద్ద వయస్కులు పి.మహమ్మద్‌ కుట్టి (90), అతి పిన్న వయస్కురాలుగా ఆర్య రాజేంద్రన్‌ (23)నిలిచారు. మహాసభకు మొత్తం 734 మంది ప్రతినిధులు హాజరుకావాల్సి ఉండగా 729 మంది హాజరయ్యారు. 77 మంది పరిశీలకులకుగాను అందరూ హాజరయ్యారు. మొత్తం ప్రతినిధుల్లో 94 మంది మహిళలు ఉన్నారు. ప్రతినిధుల్లో వీరిది 12.89 శాత. 77 మంది పరిశీలకుల్లో 12 మంది మహిళలు ఉన్నారు. అత్యధిక జైలు జీవితం గడిపిన వ్యక్తిగా యూసఫ్‌ తరిగామి (6 ఏళ్లు) ఉన్నారు. ఐదేళ్లు పైబడి జైలు జీవితం గడిపిన వారు ముగ్గురు, 2ా5 ఏళ్లు జైలు జీవితం గడిపినవారు 12 మంది, 1-2 సంవత్సరాలు జైలు జీవితం గడిపినవారు 21 మంది, 6మాసాల నుండి సంవత్సరం జైలు జీవితం గడిపినవారు 20 మంది ఉన్నారు. అత్యధిక కాలం అజ్ఞాత జీవితం గడిపినవారిగా కాంతి గంగూలి( 8 సంవత్సరాల 6 మాసాలు) నిలిచారు.
ప్రతినిధుల్లో 30 సంవత్సరాల లోపు వయసున్నవారు ఏడుగురు, 30 - 39 సంవత్సరాల వారు 21 మంది, 40 - 49 సంవత్సరాల వారు 77 మంది, 50 - 59 సంవత్సరాల వారు 217 మంది ఉన్నారు. 60 - 69 సంవత్సరాల వారు 290 మంది, 70 ఏళ్లకు పైబడిన వారు 117 మంది ఉన్నారు.
పరిశీలకుల్లో 30 సంవత్సరాల లోపు వారు ఆరుగురు, 30-39 సంవత్సరాల వారు 8 మంది, 40 - 49 సంవత్సరాల వారు 8 మంది, 50 - 59 సంవత్సరాల వారు 22 మంది ఉన్నారు. 60 - 69 సంవత్పరాల 24 మంది, 70 ఏళ్లు, అంతకు పైబడిన వారు 8 మంది ఉన్నారు.