ప్రతినెలా మీటర్ రీడర్లకు జీతాలు చెల్లించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్
ప్రతినెలా మీటర్ రీడర్లకు జీతాలు చెల్లించాలని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. సోమవారం ఆత్మకూరు ఎపిఎస్‌పిడిసిఎల్ డివిజన్ కార్యాలయం ఎదుట యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ , యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు జివి శివప్రసాద్ మాట్లాడుతూ ధర్నా ముఖ్య ఉద్దేశం కార్మికుల మీటర్ రీడర్స్ సంస్థ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామిమై పనిచేస్తున్నారన్నారు. అటువంటి వారికి గత రెండు నెలల నుండి జీతాలు ఇవ్వలేదని తెలిపారు. పాత కాంట్రాక్టర్ పనిచేస్తూ ఆయన మారారని, కొత్త కాంట్రాక్టర్ వచ్చారు పాత కాంట్రాక్టర్ ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండానే ఆయనకు వేరే దగ్గర కాంట్రాక్టు అవకాశం కల్పించారని తెలిపారు. ఆయన మీటర్ రీడర్లకు రెండు నెలలుగా జీతాలు బకాయిలు ఇవ్వలేదని అదేవిధంగా 5 నెలల నుండి ఈపిఎఫ్ కట్టకుండా ఆయన వెళ్లిపోయాడని తెలిపారు. దీనిపై ఇక్కడ ఉన్న డివిజనల్ ఇంజనీరుకు వినతిపత్రం అందజేశారు. ఆ వినతిపత్రాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా దాదాపు నెలయినా ఇప్పటివరకు పరిష్కారం కాకపోవడం దారుణమన్నారు. ప్రతినెలా 5వ తేదీ లోపు మీటర్ రీడర్లకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రతినెలా ఈపిఎఫ్ చెల్లించిన తర్వాతనే కాంట్రాక్టు బిల్లు పెట్టుకునేందుకు చట్టం ఉందని తెలిపారు. ఈపిఎఫ్ చెల్లించుకుని చెల్లించిన రసీదులను డివిజన్ కార్యాలయానికి సమర్పిస్తే అప్పుడు కార్మికులు బిల్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈపిఎఫ్ కట్టకుండానే ఆయన ఎలా బిరుదులు చేసుకున్నాడనేది అర్థం కాని పరిస్థితిలో ఉందన్నారు. ఈ విషయాన్ని సిఐటియుగా తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కార్మికులకు ఈపిఎఫ్ సమస్య రాకుండా ప్రతినెలా ఈపిఎఫ్ కట్టుకొని వచ్చిన తర్వాత బిల్లు పెట్టే విధంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ డివిజన్ అధ్యక్షులు విజయరామిరెడ్డి కార్యదర్శి బాలకొండయ్య, సిఐటియు మండల అధ్యక్షులు కొండమూరి హజరత్తయ్య, కాంట్రాక్ట్ వర్కర్స్ గౌరవాధ్యక్షులు మహేష్, మీటర్ రీడర్స్ ఎం మోహన్ రావు, ఖాజా మొహి,ద్దీన్ నాగరాజు, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.










