Jun 23,2023 21:55

ఫొటో : విద్యార్థినికి పురస్కారం అందజేస్తున్న వైసిపి నాయకులు, ఉపాధ్యాయులు

ప్రతిభకు ప్రోత్సాహం అభినందనీయం
ప్రజాశక్తి-కొడవలూరు : ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల ప్రతిభను ప్రభుత్వం - ప్రోత్సహించడం అభినందనీయమని వైసిపి నేత చక్కా మనోహర్‌ బాబు పేర్కొన్నారు. మండలంలోని కొత్తవంగల్లు జెడ్‌పి ఉన్నత పాఠశాలలో పది ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించి ఆణిముత్యాలుగా నిలిచిన దేవళ్ల సింధు, పగడాల విష్ణు, తాటిచెట్ల భానుతేజలను ఆ పాఠశాలలో శుక్రవారం సత్కరించి నగదు పురస్కారం, ప్రశంసాపత్రం, మెడల్‌ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనూ ప్రతిభ కనబరచిన విద్యార్థులను ప్రభుత్వం గుర్తించి ఆణిముత్యాల పేరుతో సత్కరించడం ప్రశంసనీయమన్నారు. దీనివల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి విద్యలో రాణించేందుకు దోహదపడుతుందన్నారు. పాఠశాలలో 72 శాతం ఉత్తీర్ణతకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం వెంకటరామకుమార్‌, విద్యా కమిటీ చైర్మన్‌ చక్కా వంశీ, ఎంపిటిసి నంబూరి ప్రసాద్‌, నాయకులు కొనిజేటి శేషగిరిరావు. గంధం సురేష్‌, వేముల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.