విద్యార్థులతో మాట్లాడుతున్న ఎఎస్‌డబ్ల్యూ
చిలమత్తూరు : స్థానిక బిసి హాస్టల్ లోని పది విద్యార్థుల్లో 500 కన్న ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ప్రతి విద్యార్థికి తాను సొంతంగా రెండువేల రూపాయలు ప్రోత్సాహకం ఇస్తానని బిసి హాస్టల్ ఎఎస్‌డబ్ల్యూ నాగేంద్ర రాజు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక బిసి బాలుర వసతి గృహాన్ని ఆయన సందర్శించి పది విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. పదిలో హాస్టల్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డన్ ఓబుళ రెడ్డి, ఓబుళేసు తదితరులు పాల్గొన్నారు.










