Jun 05,2023 21:09

రైతులకు పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే చింతల

పీలేరు : రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం పీలేరు మండలంలోని గూడరేవుపల్లి, వేపులబైలు పంచాయతీల్లో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు ఎన్నో సంక్షేమ, అభివద్ధి పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదరించి, ఆశీర్వదించి మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందని పేర్కొన్నారు. వేపులబైలు సచివాలయం ముందు జరిగిన కార్యక్రమంలో పంచాయితీకి చెందిన 150 మంది రైతులకు సంబంధించిన చుక్కల డికెటి భూములను రెగ్యులర్‌ చేస్తూ ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలను రైతులకు పంపిణీ చేశారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చాన హామీల్లో ఇప్పటికే 90 శాతంకు పైగా అమలు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి ఏటి రత్నశేఖర్‌ రెడ్డి, పీలేరు గూడరేవుపల్లి రేపుల బైలు పంచాయతీల సర్పంచులు డాక్టర్‌ షేక్‌ హబీబ్‌ బాష, దండు జగన్మోహన్‌ రెడ్డి, చంగల్‌ రాయుడు, వైస్‌ ఎంపీపీ రైల్వే చలపతి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి హుమయూన్‌, నాయకులు మిట్టపల్లి రమేష్‌ రెడ్డి, ఎంపీటీసీ మధుసూదన్‌ రెడ్డి, నారాయణరెడ్డి, భాస్కర్‌ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలతో పాటు తహశీల్దార్‌ ధనుంజయులు, ఎంపిడిఓ మురళీమోహన్‌ రెడ్డి, ఇతర మండల స్థాయి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.