Dec 09,2022 22:29

హౌసింగ్‌ అధికారులను ఆదేశిస్తున్న జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌

ప్రజాశక్తి - ధర్మవరం టౌన్‌ : ప్రభుత్వం మంజూరు చేసిన ప్రతి ఇల్లు వెంటనే గ్రాండింగ్‌ కావాలని కలెక్టర్‌ బసంత కుమార్‌ ఆదేశించారు. పట్టణంలోని పోతులనాగేపల్లి జగనన్న హౌసింగ్‌ లేఅవుట్‌ను ఆయన శుక్రవారం పరిశీలించారు. అధికారులతో ఇళ్ల నిర్మాణాలు, లబ్దిదారుల సమస్యలు తదితర వాటిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ నెలాఖరు నాటికి ప్రతి ఒక్క ఇల్లు గ్రౌండింగ్‌ కావాలని అధికారులను ఆదేశించారు. పోతుల నాగేపల్లి జగనన్న హౌసింగ్‌ లేఅవుట్‌లో 2098 ఇళ్లు మంజూరు కాగా 99 నాన్‌స్టాటెర్డ్‌, 273 బేస్మెంట్‌ స్థాయి కన్నా తక్కువలో, 1948 బేస్మెంట్‌ స్థాయిలో, 118 ఆర్‌ఎల్‌ స్థాయిలో, 36 ఆర్సీస్థాయిలో ఉన్నాయని అన్నారు. మరో 64 పూర్తయ్యాయని తెలిపారు. మరో లేఅవుట్‌లో 2118 ఇళ్లు మంజూరు కాగా 685 నాన్‌ స్టార్టెడ్‌, 947 బేస్మెంట్‌ స్థాయి కన్నా తక్కువలో, 459 బేస్మెంట్‌ స్థాయిలో, 15 ఆర్‌ఎల్‌ స్థాయిలో, 9 ఆర్సీ స్థాయిలో ఉన్నాయని మరో మూడు పూర్తయ్యాయని తెలిపారు. నెలాఖరుకు ప్రతి ఇంటి నిర్మాణం మొదలు పెట్టాలన్నారు. ఈనెల 21వతేదీ నాటికి లేఅవుట్‌లో విద్యుత్‌, నీటి సరఫరా సిద్ధంగా ఉండాలని, విద్యుత్‌ సౌకర్యం త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి హౌసింగ్‌ పీడీ నాగరాజు, డీఈ మునీశ్వరాయుడు, ఏఈ బాలాజీ, ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ యోగేశ్వరిదేవి, హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ మారుతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.