Jun 13,2023 21:12

ఫ్లెక్సీల వద్ద సెల్ఫీ తీసుకుంటున్న నారా లోకేష్‌


కడప జిల్లాలో ముగిసిన పాదయాత్ర
గోపవరం : గతంలో రాయలసీమను అభివృద్ది చేసింది తామేనని, మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్‌ రాయలసీమలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. యువగళం పేరుతో లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర 125 రోజుకు చేరుకుంది. మంగ ళవారం బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలోని పిపి కుంట విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. బద్వేలు ఫారెస్ట్‌ రేంజి-1లో యువత, రేంజి-2లో మహిళలు, రేంజి-3లో రైతులతో సమావేశాలు నిర్వహించారు. అనంతరం నెల్లూరు జిల్లా ఆత్మ కూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల లోకేష్‌ మాట్లాడారు. బద్వేలు క్యాంప్‌ సైట్‌ బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు సెల్ఫీలు దిగి వైసిపికి ఛాలెంజ్‌ చేశారు. రాయలసీమకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చకు మేము సిద్దం అంటూ సవాల్‌ విసిరారు. నాలుగేళ్లలో జగన్‌, వైసిపికి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు సీమకు చేసింది ఏమీ లేదన్నారు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని విమర్శించారు. క్యాంప్‌ సైట్‌ ముందు టిడిపి హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు, సీమకు వచ్చిన కంపెనీల లిస్ట్‌ ప్రదర్శిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తాము చేసింది ఎంటో చూపించాం, మీరు చేసింది ఎంటో చెప్పే దమ్ము ఉందా అంటూ జగన్‌కి లోకేష్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో నాలుగేళ్ల అరాచకపాలనలో బాధితులుగా మారిన ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా తాను చేపట్టిన యువగళం పాదయాత్ర తొలి మజిలీని మీ అందరి ఆశీస్సులతో విజయవంతంగా పూర్తి చేయగలిగానని పేర్కొన్నారు. 124 రోజుల పాటు నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో నాతోపాటు యువగళం బందాలను కంటికి రెక్కలా కాపాడుకుంటూ రాయలసీమ ప్రజలు మాపై చూపిన ఆదరాభిమానాలను జీవితంలో మరువలేనని పేర్కొన్నారు. అడుగడుగునా సీమ ప్రజల కష్టాలను నేరుగా చూశాక తీవ్ర మనోవేదనకు గురయ్యానని తెలి పారు. రాయలసీమ బిడ్డగా ఈ ప్రాం తంలో నెలకొన్న సాగు, తాగునీరు, నిరు ద్యోగం, వలసల నివా రణకు శాశ్వత పరి ష్కారం చూపాలని నిర్ణయిం చుకున్నానని చెప్పారు. అధికా రంలోకి వచ్చిన వెంటనే మిషన్‌ రాయల సీమ ద్వారా మీ కన్నీళ్లు తుడి చి రుణం తీర్చు కుంటానని యువ గళం సాక్షిగా మాట ఇస్తున్నాను. ఎంతటి గడ్డు పరిస్థి తుల్లోనైనా ప్రత్యర్థులకు ఎదు రొడ్డి నిలబడే పోరాట స్ఫూర్తిని మీ నుంచి పొందిన తాను లక్ష్యాన్ని చేరుకునేవరకు విశ్రమి ంచబోనని పేర్కొన్నారు.
ముగిసిన లోకేష్‌ యువగళం పాదయాత్ర
యువగళం పేరుతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర కడప జిల్లాలో విజయవంతంగా పూర్తిచేసింది. ఉమ్మడి కడప జిల్లాలో 16 రోజులు 200 కిలోమీటర్ల. మేర కొనసాగింది. గోపవరం మండలంలోని పిపి కుంట వద్ద లోకేష్‌కి రాయలసీమ టిడిపి నాయకులు వీడ్కోలు పలికారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి లోకేష్‌ పాదయాత్ర ప్రవేశించిన సందర్భంగా ఆ జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో నాయకులు బీద రవిచంద్ర యాదవ్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, బోల్లినేని వెంకటరామారావు, కంభం విజయరామిరెడ్డి, కురు గోండ్ల రామకృష్ణ, కోమ్మి లక్ష్మయ్య నాయుడు, ఆనం వెంకట రమణారెడ్డి, తాళ్ల పాక రమేష్‌ రెడ్డి, కాకర్ల సురేష్‌, కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి, పనబాక కృష్ణయ్య, కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, మాలేపాటి సుబ్బనాయుడు, తాళ్లపాక అనురాధ, ఆనం రంగమయూర్‌రెడ్డి ఉన్నారు.