ప్రజాశక్తి-నెల్లూరు జిల్లాలోని 16 కేంద్రాల్లో ఎపిఎస్‌ఎల్‌పిఆర్‌బి నిర్వహించిన ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరైయ్యేందుకు 7,835 మందికి గానూ 987 మంది గైర్హాజరు కాగా, 6,845 మంది పరీక్ష రాసినట్లు నిర్వహకులు వెల్లడించారు. ఈ పరీక్షలు ఎస్‌పి సిహెచ్ విజయరావు పర్యవేక్షణలో నగరంలోని డికెడబ్ల్యూ, గీతాంజలి , నారాయణ ఇంజనీరింగ్, జగన్స్ తదితర కళాశాలల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు మొదటి పేపరు, మధ్యాహ్నం 02.30 గంటల నుంచి సాయంత్రం 05. 30 గంటల వరకు రెండవ పేపరుకు పరీక్షలు ప్రశాంతమైన వాతా వరణంలో నిర్వహించారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఉండేలా సంబంధిత పోలీసు అధికారులకు తగు సూచనలు అందజేశారు.










