గుడిబండ : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం4 గంటలకు సజావుగా జరిగాయి. మండల వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో 632 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా 21 మంది ఉపాధ్యాయుల ఓటర్లు ఉన్నారు. 632 మంది పట్టభద్రుల ఓటర్లలో 498 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మండల వ్యాప్తంగా 21 మంది ఉపాధ్యాయులు ఉండగా అందులో 20 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 653 ఓట్లు ఉండగా అందులో 518 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని ఈ ఎన్నికల్లో 79 .9 శాతం ఓటింగ్ జరిగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, తహశీల్దార్ నాగభూషణం తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ మునిప్రతాప్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
గోరంట్ల : మండలంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా జరిగింది. మండల వ్యాప్తంగా పట్టభద్రులు 1640 ఓటర్లు ఉండగా ఇందులో 1333 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దీంతో 81శాతం ఓటింగ్ నమోదైంది. ఉపాధ్యాయుల 138 ఓటర్లు ఉండగా ఇందులో 133 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పోలింగ్ అధికారులు తెలిపారు. పుట్టపర్తి ఆర్డీవో భాగ్యసురేఖ పోలింగ్ సరళిని పరిశీలించారు
అగళి : మండలంలోని ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగాయి .మొత్తం మండల వ్యాప్తంగా 456 ఓట్లు ఉండగా అందులో 387 ఓట్లు పోలింగ్ అయ్యాయి మొత్తం శాతం 85శాతం పోలింగ్ నమోదైందని తహశీల్దార్ తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తహశీల్దార్‌తో పాటు టిడిపి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మడకశిర సిఐ సురేష్ బాబు ఎన్నికల సరళి పర్యవేక్షించారు.
నంబుల పూలకుంట : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 601 ఉండగా వారిలో 459 మంది ఓటు హక్కుకు వినియోగించుకున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు 28 ఉండగా 26 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సెక్టర్ ఆఫీసర్, రెవిన్యూ ,పోలీసు వారి సేవలు మరింతగా వినియోగించుకోవడం వల్ల ఎన్నికల ప్రశాంతంగా జరిగినాయి అని అధికార ప్రతిపక్షమితపక్ష నాయకులు తెలిపారు.
బుక్కపట్నం : ుండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో జరిగిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఎన్నికల జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, ఆర్డీవో భాగ్య రేఖ పరిశీలించారు. మండల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్లు 920 మంది ఉండగా 688 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఓటర్లు 67 ఉండగా 55 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్ ఓటు శాతం 74, ఉపాధ్యాయ ఓటు శాతం 82 గా నమోదయినట్లు అధికారులు తెలిపారు.
నల్లమాడ : ఎమ్మెల్సీ ఎన్నికలు నల్లమాడలో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. 81 మంది ఉపాధ్యాయ ఓటర్లు, 956 పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ ఓటర్లలో 49 మంది పురుషులు, 24 మంది మహిళ ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రుల ఓటర్లలో 522 మంది పురుషులు, 191 మంది మహిళలు ఓట్లు వేశారు. ఉపాధ్యాయ ఓటర్లలో 90. 12 శాతం, పట్టభద్రుల ఓటర్లలో 74. 58 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల నిర్వహణ అధికారి, తహశీల్దార్ దేవేంద్ర నాయక్ తెలిపారు.
గాండ్లపెంట : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించినట్లు పోలింగ్ అధికారులు స్వర్ణ కుమార్, శ్రీనివాసులు తెలిపారు. పట్టబద్రుల ఓటర్లు 686 గాను 573 ఓట్లు,ఉపాధ్యాయుల ఓటర్లు 30 గాను 28 పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ బి. మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
తలుపుల : సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 98శాతం పోలింగ్ నమోదయిందని అధికారులు తెలిపారు.
పరిగి : మండల కేంద్రంలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు పోలింగ్ అధికారులు సురేష్ బాబు, గుర్నాథ్ రెడ్డి తెలిపారు. పట్టభద్రుల ఓటర్లు 904 మందికి గాను 765 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 87 మంది గాను 84 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా ఎస్‌ఐ నరేంద్ర భద్రత చర్యలు చేపట్టారు.
అమరాపురం : మండల కేంద్రంలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా ముగిసినట్లు మండల ఎన్నికల అధికారి, తహశీల్దార్ సురేష్ కుమార్ తెలిపారు. ఉపాధ్యాయ ఓటర్లు 49 మంది గాను 47 మంది, పట్టభద్రుల ఓటర్లు 1145 మంది గాను 794 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
చిలమత్తూరు : సోమవారం జరిగిన పట్టభద్రుల,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగాయి. మండల వ్యాప్తంగా 782 మంది పట్టభద్రుల ఓటర్లుఉండగా మొత్తం 565 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 32 మందికి గాను 31 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో చివరి గంట సమయంలో అత్యధికంగా 135 ఓట్లు నమోదు కావడం విశేషం.
ఓబుల దేవర చెరువు : ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 94శాతం ఓటింగ్ నమోదైనట్లు తహశీల్దార్ శ్రీధర్ తెలిపారు.
రొద్దం : మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల ఓటర్లు 830 మందికి గాను 722 మంది, ఉపాధ్యాయుల ఓటర్లు 29 మంది గాను 28 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల తీరును పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, పర్యవేక్షించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత వేర్వేరుగా పరిశీలించారు.
అమడగూరు : మండల కేంద్రంలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల ఓటరుల 558 మందికి గాను 407 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 28 మందికి గాను 27 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు పోలింగ్ అధికారి నాగరాజు, తహశీల్దార్ రెడ్డి శేఖర్ తెలిపారు.
పుట్టపర్తి అర్బన్ : శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలలో పట్టభద్రులు 70.70 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయులు 92.71 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 43,310 మంది పట్టభద్రులు ఓటర్లు,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 3348 మంది ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు పట్టభద్రులు 70.70 శాతం ఉపాధ్యాయులు 92.71 శాతం తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పెనుకొండ : ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం పట్టణంలో ప్రశాంతంగా ముగిశాయి. పట్టుభద్రుల ఓటర్లు 810 మందికి గాను 707 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో పోలింగ్ కేంద్రంలో 850ఓటర్లు ఉండగా 719మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా 96 మంది ఓటర్లకు గాను 92మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సోమందేపల్లి : మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల ఓటర్లు 1119 మందికి గాను 934 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 35 గాను 35 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎస్‌ఐ విజరు కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
హిందూపురం : ఉపాధ్యాయ, పట్టుభద్రుల శాసనమండలి ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలోని ఎంజిఎం పాఠశాలలో పట్టుభద్రుల కోసం 6, ఉపాధ్యాయుల కోసం ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసే సమయానికి పట్టుభద్రులు 3263 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయులు మొత్తం 684 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తహశీల్దార్ సౌజన్య లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర రావు తెలిపారు. అయితే పట్టుభద్రుల్లో మహిళులు వారి చంటి బిడ్డలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి ఓటు వేశారు. స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసిపి ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ వారి ఓట్లు నమోదు చేసుకున్నారో లేదో తెలియరాలేదు. ఇక్కడ వారి ఓట్లు వేయడానికి రాలేదు. అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు వారి ఓటుహక్కును వినియోగించుకున్నారు. డీఎస్పీ యశ్వంత్, సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల అనంతరం బారీ బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్సులను అనంతపురంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముకు తరలించారు.
పెనుకొండ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగాసోమవారం పట్టణంలోని పోలింగ్ కేంద్రాల వద్ద పిడిఎఫ్ అభ్యర్థుల తరపున పోలింగ్ పనుల్లో వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ నాయకులు, ప్రజాసంఘాలు, యుటిఎఫ్, ఎస్‌టియు నాయకులు నిమగం అయ్యారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ నాయకుడు సుధాకర్, నారాయణస్వామి, రమేష్, నరేష్, రవీంద్రనాథ్ తదితరులు ఉపాధ్యాయులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరి, రమేష్, సిపిఐ నాయకులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
కనగానపల్లి : మండల పరిధిలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 969 పట్టభద్రులకు 709 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఓటర్లు 22 మందికి ఉండగా 19 మంది ఓటు వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ హనుమంతురెడ్డి, ప్రత్యేక పోలీసు బృందాలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
బత్తలపల్లి : బత్తలపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 75 శాతం, ఉపాధ్యాయ స్థానానికి 89.65 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు సీఐ మస్సూరుద్దీన్, బత్తలపల్లి ఎస్‌ఎస్‌ఐ టీవీ శ్రీహర్ష, మరో ఎస్‌ఐ రాడార్, ముగ్గురు ఏఎసీలు, ఇద్దరు జమీందార్లు, 30 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్, ఆర్టీఓ తిప్పేనాయక్, తహశీల్దార్ యుగేశ్వరిదేవి, డిప్యూటీ తహశ్దీార్ ప్రసాద్ పరిశీలించారు.
ముదిగుబ్బ : మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో 1,357 మంది పట్టభద్రులు ఉండగా 931 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 68 శాతం పోలింగ్ నమోదైంది. ఉపాధ్యాయులకు 87 మంది ఉండగా 82 మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు తహశీల్దార్ నాగేంద్ర తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ హేమంత్‌కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
లేపాక్షి: మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రులు 566 మందికి గాను 416 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు మొత్తం 35 మందికి గాను 35మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సరళిని డిఎస్‌పి యశ్వంత్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కాటం బాబు, ఎంఇఒ నాగరాజు నాయక్, ఎస్‌ఐ మునీర్ అహమ్మద్, విఆర్‌ఒ తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : కదిరి మండలంలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రశాంతంగా ముగిసాయి. కదిరి పట్టణంతోపాటు రూరల్ వ్యాప్తంగా 75 శాతం మంది పట్టబద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి 94 శాతం ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికార వైసిపి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం కొనసాగించడం విమర్శలు దారితీసింది. ఓటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయసంఘటనలు చోటు చేసుకోకుండా కదిరి రూరల్ అప్ గ్రేడ్ సిఐ సూర్యనారాయణ అధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ధర్మవరం టౌన్ : పట్టభద్రుల ఎమ్మెల్సీకి ధర్మవరం నియోజకవర్గవ్యాప్తంగా 12 పోలింగ్ కేంద్రాల్లో 9,560 ఓటర్లు ఉండగా 7,294 మంది ఓటుహక్కు వినియోగించుకోవడంతో 76.88 పోలింగ్ శాతం నమోదైంది. ఇందులో ధర్మవరం మండలంలో 6,291 మంది ఓటర్లకు 4933, ముదిగుబ్బ మండలంలో 1857 మందికి 930, బత్తలపల్లిలో 1092 మందికి 818, తాడిమర్రి మండలంలో 820 మందికి 813 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఓటర్లు 652 మంది ఉండగా 616 మంది ఓటుహక్కును వినియోగించుకోవడంతో 94.47 శాతం నమోదైంది. ధర్మవరం మండలంలో 487 మందికి 464, బత్తలపల్లి మండలంలో 58 మందికి 52, తాడిమర్రి మండలంలో 20 మందికి 18, ముదిగుబ్బ మండలంలో 87 మందికి 82 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాగా ఆయా కేంద్రాల వద్ద ఇన్‌ఛార్జి డీఎస్పీ హుసేన్‌పీరా, వన్‌టౌన్ సిఐ సుబ్రమణ్యం, రూరల్ సిఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్టమైన బందోబస్తు నడుమ జిల్లాకేంద్రానికి తరలించినట్లు ఆర్డీఓ తిప్పేనాయక్ తెలిపారు. అలాగే స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సతీమణి సుప్రియ, సోదరుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డితో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు.










