Mar 12,2023 21:27

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి : జెసి

ఈనెల 13న నిర్వహించబోయే పట్ట భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంత వాతావ రణంలో నిర్వ హించాలని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయ పిఒలు, ఎపిఒలకు సూచిం చారు. ఆదివారం రాయచోటి డివిజన్‌కు సంబ ంధించి స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల పోలి ంగ్‌ సరళిలో ఎటువంటి సమస్యలు తలెత్త కుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ నిర్వ హించేందుకు పోలింగ్‌ సిబ్బంది కషి చేయా లన్నారు. పోలింగ్‌ మెటీరియల్‌కు సంబంధించి మార్క్‌డ్‌ పెన్‌, ఓటర్ల జాబితా, బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు, పిఓలు, ఏపీవోలు చెక్‌ లిస్టు ప్రకారం ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని పోలింగ్‌ సా మగ్రి మొత్తం జాగ్రత్తగా తీసుకొని కేటాయించిన బస్సులలో పోలింగ్‌ కేంద్రాలకు బయలుదేరి వెళ్లాలన్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగు స్తుందన్నారు. సాయంత్రం 4 గంటలలోపు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు. ఓటర్లకు ఓటర్‌ స్లిప్‌తో పాటు తప్పకుండా ఏదో ఒక గుర్తింపు కార్డు ఉండాలన్నారు. ఈ ఎన్నికలను ప్రతి ఒక ్కరు సీరియస్‌గా తీసుకొని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతా వరణంలో పోలింగ్‌ నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.పోలింగ్‌ కేంద్రంలో సిబ్బందికి సూచనలిస్తున్న జెసి తమీమ్‌ అన్సారియా