Mar 13,2023 21:32

ఫొటో : ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
- రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు వెల్లడి
ప్రజాశక్తి-అల్లూరు : రాష్ట్రంలో 9 ఎంఎల్‌సి స్థానాలకు సంబంధించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌ రావు వెల్లడించారు. సోమవారం మండల కేంద్రం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఆయన ఓటు హక్కును వినియోగించుకుని పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరుగుతున్న ప్రస్తుత ఎన్నికల్లో 10లక్షల 59వేల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
ఇప్పటికే 5 శాసనమండలీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని అందులో భాగంగా టీచర్లకు-3, పట్టభద్రులకు -2, అలాగే 4 శాసనమండలి ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయని వివరించారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల రాద్ధాంతం తప్ప ఇంకేమీ లేదన్నారు. ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారో అంటూ ప్రజల్లో అపోహ కల్పించారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సహకారంతో ఇటీవల విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మెట్‌లో రూ.13 కోట్ల 68 లక్షలు పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు విచ్చేసి ఎంఒయుపై సంతకాలు చేసి వెళ్లారన్నారు. రాష్ట్రంలో 6 లక్షల 50 వేల మందికి జగన్మోహన్‌ రెడ్డి అవకాశాలు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.