Dec 28,2022 21:28

క్యాలెండర్‌ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ, చైర్‌పర్సన్‌, తదితరులు

ప్రజాశక్తి-హిందూపురం : ప్రజల సంక్షేమం కోసం ప్రజాసమస్యలను అనునిత్యం వెలికితీస్తూ నిజాయితీగా, నిర్భయంగా వార్తలను ప్రచురించే సామర్థ్యం ప్రజాశక్తి దినపత్రికకు మాత్రమే ఉందని ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఆర్‌కె ఫంక్షన్‌ హాలులో ప్రజాశక్తి 2023 నూతన క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేట్‌ పత్రికలకు పోటీగా ప్రజాశక్తి పత్రిక నిలుస్తూ కార్మిక, కర్షక, విద్యార్ధి, యువజన బడుగు, బలహీన మైనార్టీ వర్గాల ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావటం అభినందనీయమన్నారు. ప్రజాశక్తి దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘని, వైస్‌ ఛైర్మన్‌ జబివుల్లా, వైసిపి సీనియర్‌ నాయకులు కొండూరు వేణుగోపాల్‌ రెడ్డి, కౌన్సిలర్లు జయరాములు, మారుతీరెడ్డి, గిరీష్‌, నాయకులు చాంద్‌బాషా, ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు.