ప్రజాశక్తి-యంత్రాంగం : కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళికను విడుదల చేసిన ఫిబ్రవరి 21వ తేదీ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రెడ్ బుక్స్ డే నిర్వహించారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పలువురు కమ్యూనిస్టు మేనిఫెస్టోసహా పలు మార్క్సిస్టు పుస్తకాలను అధ్యయనం చేశారు. దక్షిణాఫ్రికాలోని దర్బన్‌లో పూరి గుడిసెల నివాసితుల ఉద్యమం ఆధ్వర్యాన సామూహికంగా అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచంలో దోపిడీ అంతమై మానవ జాతికి విముక్తి కలగడానికి కమ్యూనిజమే పరిష్కారమని, వర్గపోరాటమే మార్గమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెడ్ బుక్ డే నిర్వహించారు. పలువురు ప్రముఖులు రెడ్ బుక్ డే ప్రాధాన్యతను వివరించారు.











