Apr 30,2023 21:36

ఫొటో : ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలు

ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు
ప్రజాశక్తి-అల్లూరు : మండల కేంద్రం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆదివారం బైక్‌పై వస్తున్న ముక్కు కామేశ్వరమ్మ(60)ను బుల్లెట్‌ బండి ఢకొీనడంతో కింద పడి గాయాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఆమెను స్థానికులు వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
వివరాల మేరకు.. విడవలూరు మండలం రామతీర్థంకు చెందిన ఆమె అల్లూరులోని బంధువుల ఇంటికి వచ్చి స్థానిక పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ పోయించుకుని మనుమడితో వెళుతున్న క్రమంలో ప్రమాదం జరిగిందని బంధువులు తెలియజేశారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు.