భయాందోళనలో స్థానికులు
ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్
మండలంలోని నిడదవోలు ప్రధాన కాలువపై పెద్ద సాయిబాబా ఆలయం రోడ్డులో పెంకుళ్లపాలెం వద్ద 16 కెవి లైన్‌కు వేసిన విద్యుత్ స్తంభం కింద పగిలిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ వారు స్పందించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని పెంకుళ్లపాలెం వాసులు కోరుతున్నారు.