Apr 29,2023 21:27

ఫొటో : ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
ప్రజాశక్తి-మర్రిపాడు : ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలతో పాటు అధిక దిగులు సాధించవచ్చని ఇంటర్నల్‌ కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌ నవ్య తెలిపారు. మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఆమె ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ద్రవ జీవామృతంతో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది ఫైరు ఏపుగా పెరుగుతుందన్నారు. చీడ పీడలను తట్టుకొని వేరు శాతం అభివృద్ధి చెందుతుందన్నారు.
రైతులు అధిక దిగుబడుల కోసం ఎరువులు క్రిమిసంహారక మందులు విపరీతంగా ఉపయోగించడంతో నేల కలుషితం దిగుబడులు తగ్గిపోతాయని పేర్కొన్నారు. క్రిమిసంహారక మందులు వాడిన ఆహారం తినే వారికి కలిగే అనారోగ్య సమస్యలపై వివరించారు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూసారం పెరగడంతో పాటు దిగుబడులుకూడా పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎల్‌టు కుమారి, ఎల్‌ వన్‌ కిషోర్‌, రైతులు పాల్గొన్నారు.