ప్రజాశక్తి-వాల్మీకిపురం : రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపి అధిక ఆదాయం పొందాలని ప్రకృతి సాగు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ యశోదమ్మ అన్నారు. గురువారం మండలంలోని అయ్యవారిపల్లిలో రైతు హేమలత తనకు ఉన్న ఎకరం పొలంలో ఏ గ్రేడ్ మోడల్‌లో టమోటా, బీన్స్, పెసర, మిరప, ఉల్లి, సపోటా, ఆముదం, వంగ, బంతి, బెండ, జామ, మొటిక, అరటి, కొబ్బరి, ముల్లంగి, కమల, దానిమ్మ, కాకర, సొర, చీన, నిమ్మ, అంజీరా, గ్రీన్ ఆపిల్, రెడ్ ఆపిల్, దంటాకు, గోంగూర, బీర సాగును పరిశీలించారు. ప్రకృతి సాగులో చేపట్టాల్సిన మెలికలు, సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏ గ్రేడ్ మోడల్‌లో అంతర్ పంటలు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. 360 రోజుల పాటు దిగుబడులు, ఆదాయం గురించి రైతులకు తెలిపారు. కార్యక్రమంలో ఎల్ 2 స్వాతి, సిబ్బంది శ్రీనివాసులు, రెడ్డిబాషా, పెద్ద రెడ్డెయ్య పాల్గొన్నారు.










