Jun 22,2023 19:03

ప్రకాశం ఎన్‌సిసి క్యాడెట్లు

ప్రజాశక్తి-కందుకూరు :34 ఆంధ్రా బెటాలియన్‌ ఎన్‌సిసి ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగిన 6వ వార్షిక శిక్షణ శిబిరంలో పాల్గొన్న ప్రకాశం ఎన్‌సిసి విద్యార్థులు ప్రశంసలు అందుకోవడం హర్షనీయమని ఆఫీసర్‌ హిమామ్‌ గురువారం పేర్కొన్నారు. కళాశాల కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య అభీష్టం మేరకు విద్యార్థులు కఠోర శ్రమకోర్చి క్రమశిక్షణతో వందలాది మంది ఎన్‌సిసి క్యాడెట్లలో ప్రకాశం విద్యార్థులు ప్రత్యేక అభినందనలు అందుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. 34 ఆంధ్రా బెటాలియన్‌ ఆఫీసర్లలో ఈ విద్యార్థులు ఆది నుంచి ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంటున్నారని హిమమ్‌ వెల్లడించారు. కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య మాట్లాడుతూ బెటాలియన్‌ ఆఫీసర్‌ స్థాయి వ్యక్తులు ప్రకాశం ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రస్తావనలో బాలికల కాడెట్ల పేర్లు ఉచ్చరించి ప్రశంసించడం ఎన్‌సిసిలో కూడా తమ విద్యార్థుల సత్తాకు నిదర్శన మన్నారు. రైఫిల్‌ షూటింగ్‌లో కళ్యాణి అనే విద్యార్థి అత్యుత్తమ నేపుణ్యత ప్రదర్శిం చారని కాలేజీ శాశ్వత ఎన్‌సిసి పర్యవేక్షకుడు, అకడమిక్‌ ఇన్‌ఛార్జి ఎస్‌ఎం మీరావలి పేర్కొన్నారు. మెకానికల్‌ బ్రాంచ్‌ టి.కాశయ్య రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో జరిగిన శిక్షణలో సికింద్రాబాద్‌ సెలక్షన్‌ బోర్డు కు క్లాస్‌ ఆఫీసరుగా (లెఫ్ట్‌ నెంట్‌) ఎంపికయ్యారని ఆయన వెల్లడించారు. ఎన్‌సిసి ఆఫీసరు హిమామ్‌ ప్రత్యేక కషి,కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య లక్ష్యాలు ఎన్‌నిసి క్యాడెట్లు జాతీయస్థాయి ట్రెక్కింగ్‌ కు కేరళ, ఒడిశ్సాలకు ఇద్దరు విద్యార్థులు ఎంపికైన కాలేజీ ప్రతిష్టను పెంచారని టెక్నికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.విజయ శ్రీనివాస్‌ వెల్లడించారు.