ప్రజాశక్తి - మంత్రాలయం
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ వేణుగోపాల్ రాజు తెలిపారు. బుధవారం మండలంలోని సూగూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, పౌర వివాదాలు, దొంగతనాలు, ఇతర స్థానిక సమస్యల గురించి ప్రస్తావించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.