ప్రజాశక్తి-గోరంట్ల రాష్ట్రంలో దౌర్జన్యపాలన అంతం కావా లంటే ప్రజలంతా ఏకమై వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపు దామని మాజీ ఎమ్మెల్యే పార్థసారధి పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని గంగంపల్లి పంచాయతీ లో ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించారు. ఇందు లో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సిఎం జగన్ ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రం రావణకాష్టంగా మార్చారన్నారు. ప్రభు త్వం ఏర్పడి మూడున్నరేళ్లలో గ్రామాల అభివృద్ధి కుంటు పడిందన్నారు. అలాగే నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. మోసాలు, అబద్ధాలు, దౌర్జన్యాలతో పాలన చేస్తున్నారని విమర్శించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అయినా జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సోమశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి అశ్వర్థరెడ్డి, హిందూపురం పార్లమెంటు కార్యదర్శి దేవా నరసింహులు, జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, నాయకులు నీలకంఠారెడ్డి, చెరువుపల్లి శ్రీనివాసులు, రామస్వామి, నరసింహులు, విక్రమ్‌గౌడ్, బాలాజీ, బ్రహ్మయ్య, రుద్రప్ప, వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
తలుపుల : మండల పరిధిలోని బల్లపల్లి పంచాయతీలో సోమవారం ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాలతో బీసీ కాలనీ, దిగువ మాలపల్లి, నాగప్పగారిపల్లిలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందన్నారు. కావున రానున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ముబారక్, నాయకులు జయచంద్ర, గంగరాజు, చాంద్, రాధాకృష్ణ, బాబు, సిద్దేష్, రాజారెడ్డి, కొమ్మెర సీనా, మహేష్, అశోక్, మహేష్, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్న పార్థసారధి










