ప్రజాశక్తి-రాయచోటి టౌన్ : అన్ని వర్గాల ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు నూతనంగా నిర్మించిన మండల పరిషత్ భవన సముదాయం అందుబాటులోకి వచ్చిందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాయచోటి రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నూతన భవనాన్ని ఎంపిపి రాజమ్మ, రాష్ట్ర ఫౌరసరఫరాల డైరెక్టర్ పోలు సుబ్బారెడ్డి, జడ్‌పిటిసి వెంకటేశ్వరరెడ్డి, బిసి నాయకుడు పల్లపు రమేష్‌లతో కలిసి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం అభివద్ధి కార్యక్రమాలను మరింత చేరువ చేసే క్రమంలో సచివాలయ వ్యవస్థను పల్లె ప్రజల ముంగిటకు తీసుకువచ్చిందన్నారు. నాలుగేళ్ల పాలనలో ప్రతి పంచాయతీలో ఇంద్ర భవనాల్ల కనిపించే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజి క్లినిక్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటిలో కోట్ల రూపాయలతో మండల పరిషత్ భవనాన్ని నిర్మించి అందుబాటులోకి రావడం శుభ పరిణామన్నారు. అభివద్ధి లేదని విమర్శలు చేసే వారికి పంచాయతీలలో కనిపించే సచివాలయ భవనాలు, గ్రామీణ ప్రాంతాలకు ఏర్పాటుచేసిన తారు రోడ్లు, రాయచోటిలో జరుగుతున్న అభివ ద్ధి కార్యక్రమాలు సమాధానం చెబుతున్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, ఎపిఐఐసి స్టేట్ డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి, వైస్ ఎంపిపి జయపాల్‌రెడ్డి, విఆర్.రెడ్డి, ఎంపిడిఒ మల్‌రెడ్డి, తహశీల్దార్ ప్రేమంత్ కుమార్, ఎంపిటిసిలు ప్రభాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, నాగసుబ్బమ్మ, చిట్టెమ్మ, నాగవేణి, సహదేవమ్మ, సర్పంచులు పోలు సావితమ్మ, రాయవరం మమత, కసిరెడ్డి సుబ్బలక్ష్మి, కసిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, ప్రభావతమ్మ, తిరుపాల్ నాయుడు, ఫాహిదా, నాగవేణి, రెడ్డెమ్మ, వెంకటేష్, కో-ఆప్షన్ సభ్యులు ఖాదర్ బాష, దివాన్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.










