Mar 15,2023 21:58

ఫొటో : మాట్లాడుతున్న డిడిఒ లీలావతి

ప్రజలకు అందుబాటులో వైద్యులు
ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రభుత్వ వైద్య సేవలను అందించేందుకు ప్రజలకు అందుబాటులో వైద్యులు ఉన్నారని డిడిఒ లీలావతి పేర్కొన్నారు. బుధవారం స్థానిక వైద్యశాలలో విలేకరులతో అమె మాట్లాడుతూ వైద్యులు అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యులు మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఎక్సరే స్కానింగ్‌ ఈసీజీ సేవలో అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని వేళలో కాన్పులు సాధారణంగా చేస్తున్నామన్నారు. కావలి నుంచి శుక్ర, శనివారాలలో చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు.
ఈ అవకాశాన్ని చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నారులకు అవసరమైన శిరస్సులు అందుబాటులో ఉన్నాయని ముఖ్యంగా హెచ్‌ 3 ఎన్‌ 2 వైరస్‌ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిహెచ్‌ పరిధిలోని ప్రజలు అవగాహనతో చేతులు శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు భౌతిక దూరం పాటిస్తూ విధిగా మాస్క్‌లు ధరించాలన్నారు. యాక్సిడెంట్‌ సీరియస్‌ కేసులను ప్రధమ చికిత్స చేసి అనంతరం మెరుగైన వైద్యం కోసం బయటకు పంపడం జరుగుతుందని కారణం సరైన సదుపాయాలు లేకపోవడంతో బయటకు పంపడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ శంషుద్దీన్‌ డాక్టర్‌ సింధూర పాల్గొన్నారు.