ప్రజలకు అందుబాటులో ఉండాలి
ప్రజాశక్తి-సీతారామపురం : ప్రజా సమస్యలపై వచ్చే వారికి సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్ సూచించారు. సోమవారం మండలంలోని మారంరెడ్డిపల్లి సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. హాజరు, మూమెంట్ రిజిస్టర్, సిబ్బంది విధి నిర్వహణ రిజిస్టర్లను పరిశీలించారు. ప్రతిఒక్క సచివాలయ సిబ్బంది పనివేళలలో సచివాలయంలో అందుబాటులో ఉండాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ కచ్చితంగా వేయాలని సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు అందరూ అందుబాటులో ఉండి స్పందన కార్యక్రమం నిర్వహించాలని, సచివాలయంలో సేవలను పెంచాలని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా నాలుగు అంశాలకు సంబంధించి ఎస్‌డిజి సర్వే సకాలంలో పూర్తి చేయించాలని, ఆయుష్మాన్ భారత్ సర్వే పూర్తిచేసి పేదలకు వైద్య సదుపాయం కల్పించడానికి అందరూ కృషి చేయాలని, పెన్షన్ పంపిణీ పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఖాదర్‌బాషా, గోవర్ధన్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు.










