న్యూఢిల్లీ : ప్రజలు ఇచ్చిన తీర్పుని హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీంతో ఎన్నికల ఫలితాలపై రాహుల్‌గాంధీ స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహిస్తామని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, వలంటీర్ల కృషికి, అంకిత భావానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా తీర్పుని విశ్లేషించుకుని ముందుకు సాగుతామని, దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషిని కొనసాగిస్తూనే ఉంటుందని అన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కేవలం నామమాత్రపు స్థానాలతోనే సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌పై పూర్తిగా పట్టు కోల్పోయింది. అక్కడ ఆప్ విజయకేతనం ఎగురవేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో ఐదు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.










