May 03,2023 21:35

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి

ప్రజల సంక్షమమే జగనన్న లక్ష్యం
ప్రజాశక్తి-మర్రిపాడు : రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. మండలంలోని పల్లవోలు సచివాలయం పరిధిలోని తిక్కవరం గ్రామంలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు గజపూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ మేరకు ఆయన గ్రామంలో విస్తృతంగా పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి కుటుంబానికి అందచేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వారికి సంక్షేమ లబ్ధి కరపత్రాలను అందజేశారు.
ముఖ్యమంత్రి అందజేసిన సంక్షేమ పథకాలన్నీ అందాయా లేదా.. ముఖ్యమంత్రికి ఏం చెప్పామంటారంటూ లబ్ధిదారులతో ముచ్చటించారు. గ్రామంలో పర్యటిస్తున్న ఎంఎల్‌ఎకు పలువురు తమ సమస్యలను విన్నవించారు. గ్రామంలో తాగునీటి సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే సమస్య పరిష్కరించేలా అధికారులు చూడాలని ఆదేశించారు. ఓ దివ్యాంగుడు తనకు పింఛను నగదు బతుకుదెరువుకు సరిపోవడం లేదని, సహాయం చేయాలని అర్థించడంతో పరిష్కరించేలా చూస్తానన్నారు. చుక్కల భూముల సమస్య ఉందని పలువురు గ్రామస్తులు ఆయనకు తెలపడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు నడుంబిగించారని, ఇప్పటికే చుక్కల భూముల సమస్యను పరిష్కరించారని, సాదాబైనామా కోసం జిఒ విడుదల చేశారని తెలిపారు. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి తెలిపారు. హైలెవల్‌ కెనాల్‌ ద్వారా తమ గ్రామానికి నీటి సౌకర్యం కల్పించాలని ఎంఎల్‌ఎకు పలువురు కోరడంతో పనులు జరుగుతున్నాయని, ఈ విషయమై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తెలుపుతున్న ప్రతి సమస్యను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని, ప్రతి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల విషయమై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు గంగినేని రవీంద్రబాబు, ఎంపిటిసి గీత, సర్పంచ్‌ రమాదేవి, నారాయణస్వామి, సర్పంచులు నారాయణరెడ్డి నరసింహారావు, వైసిపి నాయకులు ప్రతాప్‌ రెడ్డి, రామకృష్ణ, మీరావలి, మాజీ ఎంపిపి కోణంగి శ్రీనివాసులు నాయుడు, నూనె ప్రసాద్‌, పలు శాఖల అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.