ప్రజాశక్తి-రాయచోటి టౌన్ : ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం రాయచోటి మున్సిపాలిటీ 24వ సచివాలయం, 33వ వార్డులోని ఇందిరమ్మ కాలనీ, మున్సిపల్ వర్కర్స్ కాలనీలలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ, సమస్యలుపై ఆరా తీస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయాలని ప్రజలనడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందడంలేదని దష్టికి తీసుకొచ్చినవారి ఎదుటే అధికారుల ద్వారా పరిష్కార మార్గాన్ని చూపించారు. వీధులలో నెలకొన్న సనస్యల పరిష్కారంపై ఆయన ప్రత్యేక దష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన సాగుతోందన్నారు. సమస్యల పరిష్కారానికే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఎన్నికలలోనూ, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దేశంలోనే ఆదర్శంగా సిఎం జగన్ నిలుస్తారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, స్థానిక కౌన్సిలర్ జ్యోష్న, మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్, బేపారి మహమ్మద్ ఖాన్, మున్సిపల్ కమీషనర్ గంగాప్రసాద్, మున్సిపల్ ఆర్‌ఐ మల్లికార్జున, అన్నయ్య, ఆంజనేయులు, వెంకటేష్ కొలిమి ఛాన్‌బాష, వాల్మీకి సంఘ అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, కొత్తిమీర ప్రసాద్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, సుగవాసి శ్యామ్స్ జానం రవీంద్రా యాదవ్, జమాల్, హెచ్‌ఎం డిగ్రీ కళాశాల అధినేత జమాల్, శ్రీనివాసులు, కో-ఆప్షన్ అయ్యవారురెడ్డి, హజరత్ ఖాదర్ వలీ, గువ్వల జగదీష్, జావీద్, అమీర్ పాల్గొన్నారు.










