Jan 05,2023 22:13

అంబేద్కర్‌ సర్కిల్‌లో ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు

            ప్రజాశక్తి-హిందూపురం    నియోజకవర్గవ్యాప్తంగా కల్తీ కల్లు తాగి ప్రజలు వారి ప్రాణాలను పోగట్టుకుంటున్నా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోరా.. అని ప్రజాసంఘాల నా యకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ కల్లు దుకా ణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పట్టణం లోని అంబేద్కర్‌ సర్కిల్‌లో ఆందోళన చేశారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం చేరుకుని తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ కల్లు వ్యాపారులు విక్ర యించే కల్లులో ఎక్కువ శాతం రసాయనాలు వేయ డం వల్ల తీవ్రంగా నిషా ఎక్కి బానిసలు అవుతున్నార న్నారు. దీంతో కల్లు తాగకపోతే మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలు లేపాక్షి మండలంలో గతంలో చోటు చేసుకుంటున్నాయన్నారు. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు బారిన ప్రజలు పడుతున్నారన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కల్లు వ్యాపారులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్‌పి నాయకులు శ్రీరాములు, ఆర్‌సిపి నాయకులు శ్రీనివాసులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు వినోద్‌కుమార్‌, చంటీ, రామాంజినేయులు, తదితరులు పాల్గొన్నారు.