Jan 12,2023 21:39

సంక్షేమ పథకాల గురించి వివరించే కరపత్రాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి,

నల్లచెరువు : ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కె.పూలకుంట, దామావాండ్లపల్లి తదితర గ్రామాలలో గురువారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలను ప్రతి ఒక్కరు తిప్పి కొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమణారెడ్డి, సర్పంచి యూసుఫ్‌, ఎంపీటీసీ భాస్కర్‌ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమణ, రాజప్ప, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : ఎలాంటి అవినీతి లేకుండా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తు పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డికి మరో సారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ ప్రజలను కోరారు. పట్టణంలోని 25వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్డులో గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీ, వైస్‌ చైర్మన్‌ జబివుల్లా, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, మున్సిపల్‌ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.