Jan 07,2023 21:21

అభివృద్ధి పథకాల కరపత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

గాండ్లపెంట : మండల పరిధిలోని కోటూరు కరణం వారి పల్లి, కుమ్మరవాండ్లపల్లి, అడ మరకవారిపల్లి తదితర గ్రామాలలో శనివారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ పివి. సిద్ధారెడ్డి పాల్గొన్నారు ఈసందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాతం జగన్మోహన్‌, వైస్‌ ఎంపీపీ భారతి, సర్పంచులు కళావతి రవీంద్ర నాయక్‌, చలపతి, ప్రతాప్‌ రెడ్డితో పాటు నాయకులు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పరిగి : మండల కేంద్రంలో ఎమ్మెల్యే నిధులతో చేపట్టిన ప్రభుత్వ కమిటీ భవనం నిర్మాణ పనులను ఎమ్మెల్యే శంకర్‌నారాయణ శనివారం ప్రారంబించారు. మండల కేంద్రంలోని బోయపేట కురుబ కాలనీ. పాత ఎస్సీ కాలనీలో చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి లక్ష్మీదేవి శివశంకర్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.