Dec 05,2022 22:05

గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి

ప్రజాశక్తి బత్తలపల్లి : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రమైన బత్తలపల్లి ఎస్సీ కాలనీ, బోయ వీధిలో ఏపీ కురుబ కార్పోరేషన్‌ చైర్మన్‌ కోటి సూర్యప్రకాష్‌ బాబు, జెడ్పీటీస్‌ కోటి సుధ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రజాసంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గొల్లపల్లి రామకృష్ణారెడ్డి, సర్పంచులు ఆక్కిం నారమ్మ,కోటి గోపీనాథ్‌, ఎంపీ టీసీ కోటి నరేష్‌ కుమార్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సిఎం చిత్రపటానికి పాలాభిషేకం
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్లరు, సేల్స్‌ మెన్లుకు వేతనాలు పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సిఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.